BANW vs ENGW : ఛేదనలో ఆరంభం నుంచి తడబడుతున్న ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మూడో వికెట్‌కు 40 రన్స్ జోడించిన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(32) ఔటయ్యింది. ఫహిమా ఖాతున్ ఓవర్లో మిడాన్‌లో షాట్‌కు యత్నించి అక్కడే కాచుకొని ఉన్న అక్తర్ చేతికి చిక్కింది. దాంతో.. 69 వద్ద మూడో వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన సోఫీ డంక్లే (0) ఎల్బీగా వెనుదిరిగడంతో బంగ్లా రేసులోకి వచ్చింది. ప్రస్తుతం క్రీజులో కుదరుకున్న హీథర్ నైట్(15 నాటౌట్) అండగా.. ఎమ్మా లాంబ్(1) క్రీజులో ఉంది. 19 ఓవర్లకు స్కోర్.. 70-4. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 109 రన్స్ కావాలి.
వరల్డ్ కప్ 8వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 180 లోపే కట్టడి చేసిన ఇంగ్లండ్ ఛేదనలో తడబడుతోంది. మొదటి ఓవర్లోనే మరుఫా అక్తర్ సూపర్ డెలివరీతో ఓపెనర్ అమీ జోన్స్(1)ను ఎల్బీగా వెనక్కి పంపింది. అనంతరం.. నహిదా అక్తర్ ఓవర్లో టమ్మీ బ్యూమంట్(13) కూడా ఔటయ్యేది. ఆఫ్‌సైడ్ డిన బంతిని క్యాచ్ అందుకోలేకపోయింది మరుఫా. ఒకవేళ ఆ క్యాచ్ పట్టిఉంటే 6 పరుగుల వద్దే ఇంగ్లండ్ రెండో వికెట్ కూడా పడేది.
GAME ON IN GUWAHATI!
Fahima Khatun strikes twice in an over to remove Nat Sciver-Brunt and Sophia Dunkley – England are 69/4 chasing 179 👀
🔗 https://t.co/dRk1F6lLvq | #CWC25 pic.twitter.com/y57fJHr6Xa
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2025
లైఫ్ లభించడంతో బతికిపోయిన బ్యూమంట్ కాసేపటికే మరుఫా ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత నాట్ సీవర్ బ్రంట్(32), హీథర్ నైట్(15 నాటౌట్ )లు ఆచితూచి ఆడారు. మరుఫా ఓవర్లో ఎల్బీఅప్పీల్తో వికెట్ కాపాడుకున్న బ్రంట్ ఆ తర్వాత మూడు ఫోర్లతో చెలరేగింది. కానీ, పదో ఓవర్ తర్వాత.. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇరువరు పెద్ద షాట్లకు యత్నించలేదు.