WPL 2024 Qualification Scenario | సుమారు మూడు వారాలుగా బెంగళూరు, ఢిల్లీ వ్యాప్తంగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో లీగ్ దశ ముగింపునకు చేరింది. లీగ్ స్టేజ్‌లో మిగిలుంది ఇంకా రెండు మ్యాచ్‌లే. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా మిగిలిన మూడు జట్లలో ఒకదానికి ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలున్నాయి. ఒక్క బెర్తు కోసం యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలోనూ ఆర్సీబీ వైపే మొగ్గు కాస్త ఎక్కువగా ఉన్నా మిగిలిన రెండింటికీ అవకాశాలున్నాయి.
సోమవారం యూపీ వారియర్స్ – గుజరాత్ జెయింట్స్ మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ 8 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. ఈ సీజన్లో యూపీ 8 మ్యాచ్‌లు ఆడి మూడు మాత్రమే గెలిచి ఐదింటిలో ఓటమిపాలైంది. ఆర్సీబీ ఏడు మ్యాచ్‌లలో మూడు గెలిచి నాలుగింట ఓడింది. రెండు జట్లకూ ఆరు పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ విషయంలో ఆర్సీబీ (+0.027).. యూపీ (-0.371) వెనుకబడి ఉంది. గుజరాత్ జెయింట్స్ ఏడు మ్యాచ్‌లలో రెండు గెలిచి ఐదు ఓడి 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఆర్సీబీ, యూపీతో పాటు గుజరాత్‌కూ ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉంది. అదెలా అంటే..
యూపీకి ఛాన్స్..
లీగ్ దశలో యూపీ ఆడాల్సిన మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కానీ ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే నేడు (మంగళవారం) ముంబై – ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌లో బెంగళూరు 60 పరుగుల తేడాతో ఓడిపోవాలి. అప్పుడు ఆ జట్టు నెట్ రన్‌రేట్.. యూపీ కంటే కిందకు పడిపోతుంది. దీంతో యూపీకి ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం దక్కుతుంది.
గుజరాత్ వెళ్లాలంటే..
పాయింట్ల పట్టికలో ఆఖర్లో ఉన్న గుజరాత్ ప్లేఆఫ్స్ వెళ్లాలన్నా ఆ జట్టు ఆశలు ఆర్సీబీతో పాటు తమ మీద కూడా ఉన్నాయి. ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో ఓడిపోయి.. బుధవారం ఢిల్లీతో ఆడబోయే మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే అప్పుడు బెత్ మూనీ అండ్ కో.కు అవకాశముంది. ఢిల్లీతో మ్యాచ్‌లో గుజరాత్.. 80కి పైగా పరగుల తేడాతో గెలిస్తే ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలుంటాయి.
ఆర్సీబీ ఏం చేసేనో..
ఢిల్లీతో గత మ్యాచ్‌లో గెలుపుకు అత్యంత సమీపంగా వచ్చి ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్లతో సంబంధమే లేదు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ నేడు ఓడితే అంతే సంగతులు…!