Probodh Tirkey : భారత హాకీ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ ప్రబోధ్ టిర్కీ ఇంట్లో చోరీ జరిగింది. ప్రబోధ్‌కు చెందిన ఐదు మెడల్స్, బంగారు ఆభరణాలను దొంగలు శుక్రవారం రాత్రి ఎత్తుకెళ్లారు. వీటితో పాటు కంప్యూటర్, రెండు టీవీ సెట్లు, ఒక బంగారు ఉంగరం, గొలుసు కూడా దొంగతనానికి గురైనట్టు తెలిసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రబోధ్‌కు ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. అయితే.. అతను మాత్రం రాంచీలో ఉంటున్నాడు. దొందతనం జరిగే సమయంలో అతని కుటుంబసభ్యులు తమ స్వగ్రామం సుందర్గఢ్లో ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. కేర్‌టేకర్ ద్వారా చోరీ విషయం తెలుసుకన్న ప్రబోధ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని బంధువులకు చెప్పాడు. మా ఇంటి తాళం పలగొట్టి ఉందని, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయని మా కేర్ టేకర్ చెప్పాడు. దాంతో, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పాను. డాగ్ స్క్వాడ్స్ ఇప్పటికే మా ఇంటిని పరిశీలించాయి అని ప్రబోధ్ తెలిపాడు.
ప్రబోధ్ కెప్టెన్సీలో 2007లో భారత జట్టు ఆసియా కప్‌లో బంగారు పతకం గెలిచింది. 1984 అక్టోర్ 6న సుందర్‌గఢ్ జిల్లాలోని లుల్కిడిహి గ్రామంలో జన్మించాడు. 2000 సంవత్సరంలో జరిగిన జూనియర్ ఆసియా కప్‌లో ఆరంగ్రేటం చేశాడు. కెరీర్ మొత్తంలో 135 మ్యాచ్‌లు ఆడాడు.