Praveen Kumar: భారత క్రికెట్ జట్టుకు గత దశాబ్దిలో స్టార్ బౌలర్‌గా సేవలందించిన ప్రవీణ్ కుమార్ గుర్తున్నాడా..? 2007 నుంచి 2012 దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ స్వింగ్ బౌలర్.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. తనదైన స్వింగ్‌తో రాణించిన ప్రవీణ్.. ఆఫ్ ది ఫీల్డ్‌లో వ్యవహార శైలి కారణంగా కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. తాజాగా ప్రవీణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడినప్పుడు ఉన్న జట్టులో అందరూ మద్యం తాగేవాళ్లని, ఏ ఒక్కరూ అందుకు మినహాయింపు కాదని వాపోయాడు.
‘ది లలన్‌టాప్’ ఓనర్ సౌరభ్ ద్వివేది నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్ లోని ఓ షోలో పాల్గొన్న ప్రవీణ్ మాట్లాడుతూ… ‘‘నేను భారత జట్టులో ఉన్నప్పుడు ‘నువ్వు తాగొద్దు. ఇలా ఉండొద్దు.. అలా ఉండొద్దు..’ అని సీనియర్లు నాతో చెప్పేవాళ్లు. అప్పుడు టీమ్‌లో అందరూ తాగేవాళ్లు. కానీ వాళ్లంతా నేను మాత్రమే తాగేవాడిని అని నన్ను బద్నాం చేశారు..’ అని వ్యాఖ్యానించాడు.
ప్రవీణ్ కుమార్ కెరీర్లో సచిన్, ద్రావిడ్, గంగూలీ, ధోని, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. వీరిలో ఎవరైనా తనకు తాగొద్దని సలహాలు ఇచ్చారా..? అని అడిగినప్పుడు… ‘నేను పేరు చెప్పను. కానీ అందరూ నాకు అడ్వైజ్‌లు ఇచ్చేవాళ్లు. అలా చెప్పినవాళ్లు ఎవరో ప్రజలందరికీ తెలుసు…’ అని ముగించడం గమనార్హం. అయితే ప్రవీణ్‌కు ఆ సలహాలు ఇచ్చింది ఎవరు..? తన పేరును బద్నాం చేసిందెవరు..? అన్నది మాత్రం అతడు వెల్లడించలేదు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఐదేండ్ల కెరీర్లో ప్రవీణ్ కుమార్.. ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.