xడార్ట్ముండ్: యూరోకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ముక్కుకు గాయమైనా చికిత్స తర్వాత ముఖానికి రక్షణగా మాస్క్‌తో ఆడిన ఫ్రాన్స్ సూపర్ స్టార్ కిలియన్ ఎంబాపె..పోలండ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టాడు. 56వ నిమిషంలో గోల్ చేసి యూరో కప్‌లో తొలి గోల్ నమోదు చేశాడు. ఈ ఎడిషన్‌లో ఫ్రాన్స్ తరఫున ఇదే తొలి గోల్ కావడం గమనార్హం. ఎంబాపె గోల్ చేసినా ఫ్రాన్స్, పోలండ్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. పోలండ్ ఆటగాడు లెవన్డొస్కి 79వ నిమిషంలో గోల్ చేసి ఫ్రాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆస్ట్రియా.. 3-2తో నెదర్లాండ్స్‌ను ఓడించగా డెన్మార్క్-సెర్బియా, ఇంగ్లండ్-స్లోవేనియా మ్యాచ్‌లలో ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు.