కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షూటర్లు ఇషా సింగ్, మనూ బాకర్ మరో పతకం రేసులోకి వచ్చారు. గురువారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ అర్హత రౌండ్లో ఈ ఇద్దరూ టాప్-8లో నిలిచారు.
క్వాలిఫికేషన్ రౌండ్లో హైదరాబాదీ షూటర్ ఇషా.. 294 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలువగా 292 పాయింట్లతో మనూ 7వ స్థానంలో ఉంది. నేడు జరుగబోయే మెడల్ రౌండ్లో టాప్-8లో నిలిచిన షూటర్లు పోటీ పడతారు.