కాన్పూర్: టీమ్ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ వ్యాక్సిన్ వేయించుకున్న తీరుపై వివాదం చెలరేగుతున్నది. మిగతా క్రికెటర్లకు భిన్నంగా కుల్దీప్ దవాఖానలో కాకుండా తన గెస్ట్ హౌజ్లో వ్యాక్సిన్ తీసుకోవడం దీనికి కారణమైంది. దీనిపై కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ తివారీ దర్యాప్తునకు ఆదేశించారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి త్వరగా నివేదిక సమర్పించాలని స్థానిక వైద్యాధికారిని కోరారు. ఇదిలా ఉంటే కుల్దీప్ ట్విట్టర్లో స్పందిస్తూ ‘వీలైనంత తొందరగా అవకాశం లభించినప్పుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రయత్నించండి’ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు.