లండన్: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్కు అల్విదా చెప్పాడు. ప్రస్తుతం ఆసీస్తో యాషెస్ ఐదో టెస్టు ఆడుతున్న బ్రాడ్.. ఈ మ్యాచ్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు.
2007 టీ20 ప్రపంచకప్లో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ధాటికి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సమర్పించుకున్న బ్రాడ్.. ఆ తర్వాతి కాలంలో గొప్ప బౌలర్గా ఎదిగాడు. ఇప్పటి వరకు 166 టెస్టులాడిన బ్రాడ్.. 600 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా నిలిచాడు. 121 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రాడ్.. 178 వికెట్లు పడగొట్టాడు. 56 టీ20ల్లో 65 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.