England XII | లార్డ్స్ టెస్టుకు ఓపెనర్‌గా ‘గే’.. యువ పేసర్ అరంగేట్రం..!
England XII : మూడు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమైన ఇంగ్లండ్ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. లార్డ్స్ స్టేడియంలో జూన్ 4 గురువారం నుంచి మొదలయ్యే తొలి టెస్టుకోసం ఓపెనర్‌గా ఎమిలియో గే (Emilio Gay) ఎంపికయ్యాడు.
England XII : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో ఆరో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్ (England) స్వదేశంలో న్యూజిలాండ్ (Newzealand)తో తలపడుతోంది. మూడు టెస్టుల సిరీస్‌కు సన్నద్ధమైన ఇంగ్లండ్ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. లార్డ్స్ స్టేడియంలో జూన్ 4 గురువారం నుంచి మొదలయ్యే తొలి టెస్టుకోసం ఓపెనర్‌గా ఎమిలియో గే(Emilio Gay) ఎంపికయ్యాడు. దేశవాళీలో పరుగుల వరద పారించిన గే ఈ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు. పేసర్ సోనీ బేర్ కూడా లార్డ్స్ టెస్టుతో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
సొంతగడ్డపై బెన్ స్టోక్స్ సేన న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య జూన్ 4 న తొలి టెస్టు జరుగనుంది. దాంతో.. ఆనవాయితీ ప్రకారం రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. స్టోక్స్ సారథిగా 12 మందితో కూడిన బృందంలో ఎమిలియో గే ఓపెనర్‌గా, సోనీ బేకర్ పేసర్‌గా ఎంపికయ్యారు.
JUST IN: England have named a 12-man squad for the first Test against New Zealand, starting at Lord’s on Thursday 🏴
Emilio Gay is set to make his debut at the top of the order, with fast bowler Sonny Baker also in line for a possible debut pic.twitter.com/7N2las3713
— ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2026
టాపర్డర్‌లో క్రాలే, ఓలీ పోప్ స్థానంలో గే, జాకబ్ బెథెల్ బరిలోకి దిగడం ఖాయమనిపిస్తోంది. జోష్ టంగ్, అట్కిన్సన్, ఓలీ రాబిన్సన్లలో ఒకరి స్థానంలో బేకర్ కొత్త బంతిని పంచుకునే అవకాశముంది. ఇంగ్లండ్ న్యూజిలాండ్ జట్లు జూన్ 17 న రెండో టెస్టు, జూన్ 25 నుంచి మూడో టెస్టు జరుగనుంది.
ఇంగ్లండ్ తుది జట్టు (తొలి టెస్టు కోసం) : బెన్ డకెట్, ఎమిలియో గే, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), ఓలీ రాబిన్సన్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, షోయబ్ బషీర్, సోనీ బేకర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

