లండన్: స్వదేశంలో జూన్ నుంచి భారత్‌తో జరుగబోయే టెస్టు సిరీస్‌తో పాటు అది ముగియగానే మొదలయ్యే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్‌లకు ఫిట్‌గా ఉండేందుకు గాను అతడు మద్యం తాగడాన్ని పూర్తిగా మానేసినట్టు వెల్లడించాడు. ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘నాకు మొదట గాయం అయినప్పుడు షాక్‌లో ఉండిపోయా.
అప్పుడు గాయం తీవ్రత కూడా పెరగడానికి మద్యం తీసుకోవడమేనని గ్రహించా. ఇక అప్పట్నుంచి ఆల్కహాల్ ముట్టకూడదని నిశ్చయించుకున్నా. జనవరి నుంచి మద్యం సేవించడాన్ని పూర్తిగా మానేశా. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకుని ఫిట్నెస్ సాధించి ఫీల్డ్‌లో అడుగుపెట్టే దాకా మందుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా’ అని చెప్పాడు. గత రెండేండ్లుగా గాయాలతో సతమతమవుతున్న స్టోక్స్.. నిరుడు డిసెంబర్లో న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా తొడ కండరాల గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.