England | నాటింగ్‌హామ్: ‘బజ్‌బాల్’ ఆటతో టెస్టు క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ దూకుడుగా ఆడుతోంది. ట్రెంట్‌బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్) వేదికగా గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. మొదటి రోజు 88.3 ఓవర్లకు 416 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఓలీ పోప్ (121) టెస్టులలో ఆరో శతకానికి తోడు డకెట్ (71), స్టోక్స్ (69) రాణించడంతో తొలిరోజే ఆ జట్టు భారీ స్కోరు నమోదుచేసింది.
టెస్టులలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును అందుకుని చరిత్ర సృష్టించింది. రెడ్ బాల్ క్రికెట్లో ఒక జట్టుకు ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ. 30 ఏండ్ల క్రితం 1994లో ఇదే ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికాపై ‘ది ఓవల్’లో 4.3 ఓవర్లలోనే 50 రన్స్ చేసింది.