MS Dhoni – Foakes : ప్రపంచ క్రికెట్లోని గొప్ప వికెట్ కీపర్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరు ముందు వరుసలో ఉండడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్లో మన మహీ భాయ్ వికెట్ కీపర్‌గా అంతగా తన ముద్ర వేశాడు మరి. ధోనీ లాంటి ఎంత గొప్ప వికెట్ కీపర్ లేడంటూ ప్రపంచమంతా కీర్తిస్తుంటే.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలెక్ స్టెవార్ట్(Alec Stewart) మాత్రం సంచలన ఆరోపణలు చేశాడు. ‘వికెట్ల వెనకాల ధోనీ ఎంతో చురుకైనవాడు. అయితే.. మా బెన్ ఫోక్స్(Ben Foakes) అతడికంటే చాలా షార్ప్’ అని అన్నాడు.
‘ధోనీ వికెట్ కీపింగ్ చూశాం. కానీ, ఫోక్స్ చాలా తెలివైన కీపర్. అతడి చేతుల వేగం సెకన్లలోపే. అతడికి సహజయంగా వచ్చిన టాలెంట్ అది. నేను సర్రే క్రికెట్ క్లబ్ డైరెక్టర్‌గా ఉన్నరోజుల్లో ఫోక్స్‌ను నిశితంగా గమనించాను. అతడు వచ్చిన చాన్స్‌ను వదులుకోడు. క్షణాల్లో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. ఇక బ్యాటర్‌గానూ ఫోక్స్ అదరగొడుతున్నాడు ‘అని స్టెవార్ట్ వెల్లడించాడు.
ధోనీ, అలెక్ స్టెవార్ట్
భారత పర్యటనలో ఆకట్టుకుంటున్నఫోక్స్ ఇప్పటివరకూ 22 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కీపర్‌గా అద్భుతంగా రాణించిన అతడు 22 క్యాచ్‌లు పట్టడమే కాకుండా 8 స్టంపౌట్లు చేశాడు. అంతేకాదు 30.72 సగటుతో 1,014 రన్స్ కొట్టాడు. వైజాగ్ టెస్టులో అతడు వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న అతడు ఈ ఫీట్ సాధించిన 12వ ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు.
Six dismissals 🤲
A real exhibition 👌
Great work, Foakesy! 👏
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/ogAMinX1So— England Cricket (@englandcricket) February 4, 2024
ఇక ధోనీ విషయానికొస్తే.. 41 ఏండ్ల వయసులోనూ వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఫైనల్లో గుజరాట్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gil)ను రెప్పపాటులో స్టంపౌట్ చేసి ఆశ్చర్యపరిచాడు.
ధోనీ స్టంపౌట్ చేశాక షాక్‌లో గిల్
ఈ లెజెండరీ కెప్టెన్ టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్స్ చేశాడు. వన్డేల్లో 123 స్టంపింగ్స్ చేసి, 321 క్యాచ్‌లు పట్టిన మహీ భాయ్..టీ20ల్లోనూ 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్స్‌తో అదరగొట్టాడు.