ENG vs USA : ప్రపంచ కప్ సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఇంగ్లండ్ (England) కీలక పోరులో అమెరికా (USA)తో తలపడుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
సఫారీలపై ఉత్కంఠ పోరులో కంగుతిన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు లీగ్ దశలో సంచలనాలు సృష్టించిన అమెరికా సూపర్ 8లో తేలిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ చేతిలో దారుణంగా ఓడింది.
ఇంగ్లండ్ జట్టు : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్, కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీసె టాప్లే.
అమెరికా జట్టు : స్టీవెన్ టేలర్, ఆండ్రిస్ గౌస్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్, అరోన్ జోన్స్(కెప్టెన్), కొరే అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లే వాన్, నొస్తుష్ కెంజిగె, అలీ ఖాన్, సౌరబ్ నేత్రావల్కర్.