ENG vs SA : పొట్టి ప్రపంచ కప్ సూపర్ 8 కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England), దక్షిణాఫ్రికా (South Africa) తలపడుతున్నాయి. సెయింట్ లూయిస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. సఫారీలను తక్కువకే కట్టడి చేయాలనే లక్ష్యంతో బౌలింగ్ తీసుకున్నాడు. సూపర్ 8 దశను విజయంతో ఆరంభించిన ఇరుజట్లు ఈ మ్యాచ్‌లోనూ గెలుపుపై కన్నేశాయి. ఈ సమఉజ్జీల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇంగ్లండ్ జట్టు : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్, కెప్టెన్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, రీసె టాప్లే.
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జి, ఒట్నిల్ బార్ట్‌మన్