SL Vs Eng | లండన్: స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 482 పరుగుల భారీ ఛేదనలో లంకేయులు 292 పరుగులకే ఆలౌట్ అవడంతో ఇంగ్లీష్ జట్టు 190 పరుగుల తేడాతో గెలుపొందింది. లంక తరఫున చండిమల్ (58), కరుణరత్నె (55), ధనంజయ డిసిల్వ (50) రాణించారు. గస్ అట్కిన్సన్ (5/62) దెబ్బకు లంక బ్యాటర్లు విలవిల్లాడారు.