లండన్: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఈనెల 20 నుంచి లీడ్స్‌లో మొదలయ్యే ఉన్న తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలో 14 మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. కీలక పేసర్లంతా గాయాలతో సతమతమవుతన్న వేళ ఆ జట్టు బౌలింగ్ భారాన్ని సీనియర్ బౌలర్ క్రిస్ వోక్స్ మోయనున్నాడు.
పేసర్ల కొరతతో మూడేండ్ల విరామం తర్వాత జెమీ ఓవర్టన్కు టెస్టు జట్టులో చోటు దక్కింది. స్పిన్నర్‌గా షోయబ్ బషీర్‌కు మాత్రమే సెలెక్టర్లు చోటిచ్చారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన జాకబ్ బెతెల్నూ టెస్టులకు ఎంపిక చేయడం గమనార్హం.
ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జెమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జెమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్