లండన్: ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టీవ్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలో ని అన్నీ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం వెల్లడించాడు.
ఏడాది కాలంగా మోకా లి గాయంతో ఇబ్బంది పడుతున్న 34 ఏండ్ల ఫిన్.. 18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 69 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 254 వికెట్లు పడగొట్టాడు.