టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి శ్రీలంకకు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఇక.. ఇంగ్లండ్‌ను జాస్ బట్లర్ ఆదుకున్నాడు. ఆయన సెంచరీ చేయకపోయి ఉంటే.. ఇంగ్లండ్ స్కోర్ 150 దాటేదే కాదు. 67 బంతుల్లో 101 పరుగులు చేసిన బట్లర్.. 6 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. కెప్టెన్ మోర్గాన్ కూడా 36 బంతుల్లో 40 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ స్కోర్ అందించాడు.
మ్యాచ్ ప్రారంభం అయినప్పటి నుంచి 10 ఓవర్ల వరకు శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి ఇంగ్లండ్‌ను కట్టడి చేయగలిగారు. కానీ.. 10 ఓవర్లు దాటాక మాత్రం ఇంగ్లండ్ ప్లేయర్లు రెచ్చిపోయారు. బట్లర్, మోర్గాన్.. ఇద్దరూ చెలరేగిపోయి ఆడారు. దీంతో ఒక్కసారిగా స్కోర్ పెరిగింది.
శ్రీలంక బౌలర్లలో హసరంగా.. 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 21 పరుగులు మాత్రమే అందించాడు. చమీరా 4 ఓవర్లు వేసి 43 పరుగులు అందించి ఒక్క వికెట్ తీశాడు.
Another wicket for Hasaranga ☝️
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Eoin Morgan is bowled after an excellent knock of 40.#T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo pic.twitter.com/VXOhBDGz0R
England set Sri Lanka a target of 164 🎯
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
Will they chase this down? #T20WorldCup | #ENGvSL | https://t.co/qlHuDOhCpo pic.twitter.com/bnEn22uxU5
We finally have our first century of the #T20WorldCup 2021 🤩
— T20 World Cup (@T20WorldCup) November 1, 2021
And it belongs to Jos Buttler 👏
A maiden T20I hundred for him! #ENGvSL | https://t.co/qlHuDOhCpo pic.twitter.com/VrWNj9iSZL