England : ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ (Ashes Series) కోసం సన్నద్దమవుతున్న ఇంగ్లండ్‌కు ఒకేరోజు గుడ్‌న్యూస్‌తో పాటు బ్యాడ్‌న్యూస్. వామప్ మ్యాచ్‌లో ప్రధాన పేసర్ మార్క్ వుడ్(Mark Wood) గాయపడ్డాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకొని స్క్వాడ్‌లోకి వచ్చిన వుడ్ వామప్ మ్యాచ్‌లో కండరాల నొప్పితో మైదానం వీడాడు. శుభవార్త ఏంటంటే కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వికెట్ల వేటతో అదరగొట్టాడు. ఇంగ్లండ్ లయన్స్ టీమ్ బ్యాటర్లను వణికించిన స్టోక్స్ ఆరు వికెట్ల(6-52)తో చెలరేగాడు. యాషెస్‌కు ముందు సారథి బౌలింగ్‌లో లయ అందుకోవడంతో ఇంగ్లండ్ జట్టు ఖుషీగా ఉంది.
యాషెస్ సిరీస్‌కు మరో వారమే ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై మార్క్ వుడ్ తమ ప్రధాన అస్త్రం అవుతాడని ఇంగ్లండ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, అంతలోనే ఈ స్పీడ్‌స్టర్ గాయపడడం ఇంగ్లండ్‌ను కలవరపరుస్తోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లో పేసర్ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి పరీక్షించినా నొప్పి తగ్గకపోవడంతో వుడ్‌కు స్కానింగ్ పరీక్షలుచేయనున్నారు.
Mark Wood, who bowled eight overs on the opening day of England’s Ashes warm-up game against the Lions, will undergo a precautionary scan on Friday. An ECB release stated that the plan was for Wood to bowl eight overs, and that he is expected to bowl again in two days’ time pic.twitter.com/H4ugqcXYLF
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2025
మరో రెండు రోజులకు వుడ్ బౌలింగ్ చేస్తాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. సో.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు అతడు దూరమైనట్టే. పెర్త్‌లో జరుగబోయే తొలి యాషెస్ టెస్టులోపు వుడ్ ఫిట్నెస్ సాధించే అవకాశముంది. చివరిసారిగా ఆసీస్ నేలపై 2010-11లో సిరీస్ గెలుపొందిన ఇంగ్లండ్.. ఈసారి విజేతగా నిలవాలనే కసితో ఉంది.
Five for Ben Stokes in England’s #Ashes warm-up game! pic.twitter.com/4kgd6PGClq
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2025