లండన్: ఇంగ్లండ్ వెటరన్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 1000వ వికెట్ తీశాడు. సోమవారం కెంట్, లాంకషైర్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో అతడు ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. దీంతో కెంట్ 34 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెంట్ బ్యాట్స్‌మన్ కున్ను ఔట్ చేసి తన ఖాతాలో 1000వ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ వికెట్‌ను వేసుకున్నాడు. ఈ మధ్య జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లోనే.. అతడు అలిస్టర్ కుక్‌ను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకూ ఆండర్సన్ 162 టెస్టులు ఆడాడు. కుక్ 161 టెస్టులు ఆడగా.. స్టువర్ట్ బ్రాడ్ 147 టెస్టులతో మూడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లకుపైగా తీసుకున్న తొలి పేస్‌బౌలర్ కూడా ఆండర్సనే. అతడు ఇప్పటి వరకూ 617 వికెట్లు తీశాడు. 2003 మే నెలలో జింబాబ్వేతో లార్డ్స్‌లో అతడు తన తొలి టెస్ట్ ఆడాడు. అయితే అప్పట్లో తాను ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంతకాలం కొనసాగుతానని అనుకోలేదని ఆండర్సన్ చెప్పడం విశేషం.
James Anderson now has a 1000 wickets in first-class cricket!
— ICC (@ICC) July 5, 2021
What an achievement 🔥pic.twitter.com/m7dmPfJEI9