లండన్: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు ఇంగ్లండ్‌కు శుభవార్త. ఇటీవల అహ్మదాబాద్‌లో టీమ్ఇండియాతో ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో గాయపడ్డ ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్‌తో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా డకెట్ గాయపడ్డాడు.
ఆ తర్వాత జరిపిన స్కానింగ్ పరీక్షల్లో గాయం తీవ్రత అంతగా లేదని తేలడంతో ఈసీబీ మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. టీమ్ఇండియా చేతిలో 0-3తో వైట్‌వాష్ ఎదుర్కొన్న ఇంగ్లండ్.. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఈనెల 18న పాకిస్థాన్‌కు చేరుకోనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఈనెల 22న లాహోర్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొనుంది.