Emilio Gay | ఇంగ్లండ్ కొత్త ఓపెనర్ ‘గే’.. అతడే ఎందుకంటే..?
Emilio Gay : టెస్టుల్లో ఓపెనర్‌గా స్థిరపడిన జాక్ క్రాలే (Zak Crawley)కు హెచ్చరికలు చేస్తూ.. కొత్త కుర్రాడిని తీసుకున్నారు. కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న ఎడమ చేతివాటం ఆటగాడైన ఎమిలియో గే(Emalio Gay)ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు.
Emilio Gay : యాసెస్ సిరీస్‌లో ఘోర వైఫల్యంతో కళ్లు తెరచిన ఇంగ్లండ్ సెలెక్టర్లు మార్పునకు శ్రీకారం చుట్టారు. టెస్టుల్లో ఓపెనర్‌గా స్థిరపడిన జాక్ క్రాలే (Zak Crawley)కు హెచ్చరికలు చేస్తూ.. కొత్త కుర్రాడిని తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు క్రాలేను పక్కన పెట్టేసి.. కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న ఎడమ చేతివాటం ఆటగాడైన ఎమిలియో గే(Emilio Gayను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. స్వదేశంలో లార్డ్స్ మైదానంలో కివీస్‌తో తొలి మ్యాచ్ ఆడడం ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో గే అరంగేట్రం చేయనున్నాడు.
గత కొన్నాళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్లో జాక్ క్రాలే, బెన్ డకెట్ది హిట్ జోడీ. కానీ, భారత పర్యటన, ఆపై యాసెస్ సిరీస్‌లో క్రాలే వైఫల్యంతో మరో ఓపెనర్ వెతుకులాట అనివార్యమైంది. యాసెస్ సిరీస్‌లో శుభారంభాలు ఇవ్వలేకపోవడంతో క్రాలేపై వేటు తప్పలేదు. అదే సమయంలో అతడిలా దూకుడుగా ఆడుతూ డకెట్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ఆటగాడిగా ఎమిలియో గే సెలెక్టర్ల కంట పడ్డాడు.
Textbook Emilio Gay. 📘#ForTheNorth pic.twitter.com/1AK2UwJsqY
— Durham Cricket (@DurhamCricket) May 9, 2026
దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణించి జాతీయ జట్టు తలుపు తట్టాడీ 26 ఏళ్ల కుర్రాడు. ఇటీవల జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సాంప్రదాయ క్రికెట్ షాట్లతో అలరిస్తూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 92 సగటుతో మూడు శతకాలు, ఒక అర్ధ శతకతో 552 పరుగులు సాధించాడీ యువకెరటం. అత్యధిక స్కోర్.. 159 నాటౌట్ కావడం విశేషం.
Who are you excited to see in action this summer? 🤔 pic.twitter.com/7PTxWoOgQV
— England Cricket (@englandcricket) May 13, 2026
అవసరాన్ని బట్టి అటాకింగ్
టెస్టుల్లో ఓపెనర్లు రాణించడం చాలా కీలకం. కానీ, బెన్ డకెట్ తొలి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడుతాడు. ఈ క్రమంలో అతు త్వరగా ఔటైన సందర్భాలున్నాయి. అందుకని.. మరో ఎండ్‌లో నింపాదిగా, ప్రత్యర్ధి బౌలర్ల వ్యూహ్లాలో చిక్కుకొని తేలికగా వికెట్ ఇవ్వకుండా ఆడగల బ్యాటర్ ఉండాలి. అందుకే.. దూకుడుగా ఆడగల నైజం.. నిలకడ, అవసరాన్ని బట్టి అటాకింగ్ గేమ్ ఆడడం.. వంటి లక్షణాలున్న ఎమిలియో గే సరైనోడు అని సెలెక్టర్లు భావించారు.
Emilio Gay, England’s next opener 🏴 pic.twitter.com/pwkkyRbF4b
— ESPNcricinfo (@ESPNcricinfo) May 14, 2026
పైగా.. గత రెండేళ్ల నుంచి అతడి సగటు 50 పైనే ఉండడంతో అతడికే ఓటేశారు సెలెక్టర్లు. జూన్ 4న లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లను కాచుకొని.. అతడు చెలరేగితే ఓపెనర్‌గా స్థిరపడడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మూడు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ జూన్ 17న కెన్నింగ్టన్ ఓవల్‌లో, మూడో మ్యాచ్ జూన్ 25న నాటింగ్హమ్లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరుగనున్నాయి.
ఇంగ్లండ్ స్క్వాడ్(తొలి టెస్టుకు) : బెన్ డకెట్, మాధ్యూ ఫిషెర్, ఎమిలియో గే, జేమ్స్ రెవ్, జాకబ్ బెథెల్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

