IND vs ENG : ఉత్కంఠగా సాగుతున్న ఓవల్ టెస్టులో భారత బౌలర్ల జోరుకు వరుణుడు (Rain) అడ్డుపడ్డాడు. టీ బ్రేక్ తర్వాత ప్రసిధ్ కృష్ణ(3-109) విజృంభణతో విజయానికి చేరువైన టీమిండియా ఉత్సాహం వర్షం నీళ్లు చల్లింది. వాన పెద్దగా పడుతుండడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఒకవేళ వర్షం తగ్గకుంటే స్టంప్‌గా ప్రకటించే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే.. ఐదోరోజు ఇంగ్లండ్ బ్యాటర్లకు.. కొత్త బంతితో భారత బౌలర్లు స్వాగతం పలకనున్నారు.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు హ్యారీ బ్రూక్(111), జో రూట్(105)లు సెంచరీలతో ఇంగ్లండ్‌ను గెలుపు వాకిట నిలిపారు. అయితే.. టీ బ్రేక్ తర్వాత సీన్ రివర్సైంది. తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన ప్రసిధ్.. ఈసారి బెథెల్‌ను, చాపకింద నీరులా పరుగులు దొంగిలిస్తున్న రూట్‌ను ఔట్ చేశాడు. దాంతో, 332తో పటిష్ట స్థితిలో ఉన్న ఆతిథ్య జట్టు 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Another twist to the tale at The Oval as bad light stops play, followed by rain!
This could be heading to a fifth day… #ENGvIND pic.twitter.com/LXbH7Ebq2D
— ESPNcricinfo (@ESPNcricinfo) August 3, 2025
ప్రస్తుతం జేమీ స్మిత్(2 నాటౌట్), జేమీ ఓవర్టన్(0 నాటౌట్)లు జట్టు గెలుపు బాధ్యత తీసుకున్నారు. ఇంగ్లండ్ విజయానికి 37 పరుగులు అవసరం కాగా.. టీమిండియాకు 4 వికెట్లు కావాలి. ఇంకా 35 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో వర్షం తగ్గాక మ్యాచ్‌లో పుంజుకొనేది ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది.