England : స్వదేశంలో ఇంగ్లండ్ జట్టు మరోసారి తమ బజ్‌బాల్ (Baz Ball)ఆటతో రెచ్చిపోతోంది. వెస్టిండీస్‌ను తొలి టెస్టులో చిత్తుగా ఓడించిన బెన్ స్టోక్స్ (Ben Stokes) బృందం రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. టాపార్డర్ దంచి కొట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్లో 20 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసింది. టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేసింది.
తొలి సెషన్లో బెన్ డకెట్, ఓలీ పోప్‌ల విధ్వంసంతో కేవలం 4.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ స్కోర్ 50 దాటింది. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో స్టోక్స్ సేన గత వరల్డ్ రికార్డు బ్రేక్ చేసింది. ఇంతకుముందు 1994లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో అర్ధ సెంచరీతో రికార్డు సృష్టించింది.
Back-to-back-to-back-to-back boundaries 😍
🔥 @BenDuckett1 pic.twitter.com/9IqzPtdwra
— England Cricket (@englandcricket) July 18, 2024
ట్రెంట్ బ్రిడ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఓపెనర్ జాక్ క్రాలే (0)ను అల్జారీ జోసెఫ్ డకౌట్ చేసి విండీస్ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే.. ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తూ బెన్ డకెట్, ఓలీ పోప్లు వీరంగమాడారు. దాంతో, ఆతిథ్య జట్టు స్కోర్ 4.2 ఓవర్లకే 50 మార్క్ చేరింది. టెస్టుల్లో తక్కువ బంతుల్లో ఫిఫ్టీ బాదడం ఇంగ్లండ్‌కు ఇది మూడోసారి.