Ken Shuttleworth : ఇంగ్లండ్ మాజీ పేసర్ కెన్ షటిల్వర్త్ (Ken Shuttleworth) కన్నుమూశాడు. ఇంగ్లండ్ తొలితరం దిగ్గజ బౌలర్లలో ఒకడైన ఆయన 80 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న షటిల్వర్త్ ఈమధ్యే మరణించాడు. ఆయన మృతి పట్ల ఇంగ్లండ్, ల్యాంక్‌షైర్ ( Lancashire) క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది.
‘మాజీ పేసర్ షటిల్వర్త ఇకలేరనే వార్త మమ్మల్ని కలిచివేస్తోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ల్యాంక్‌షైర్ తరఫున ఆయన గొప్ప ప్రదర్శన చేశాడు. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ల్యాంక్‌షైర్ తెలిపింది. దేశవాళీలో ల్యాంక్‌షైర్ తరఫున వికెట్ల వేట కొనసాగించిన షటిల్వర్త్ 1970 నుంచి 9171 మధ్య జాతీయ జట్టుకు ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసిన ఆయన యాషెస్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Lancashire Cricket is sad to hear the recent passing of former player, Ken Shuttleworth.
— Lancashire Cricket (@lancscricket) August 19, 2025
ఆరడుగుల ఎత్తుండే షటిల్వర్త్ నిప్పులు చెరిగే బంతులతో కంగారూ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. అయితే.. అనుకోకుండా గాయాల కారణంగా ఐదు టెస్టులకే పరిమితమయ్యాడీ స్పీడ్‌స్టర్. జెఫ్రీ బాయ్‌కాట్ వికెట్ తీసి వార్తల్లో నిలిచిన షటిల్వర్త్.. ఫస్ట్ క్లాస్‌లో 484 వికెట్లు పడగొట్టాడు. లీసెస్టర్ జట్టు తరఫున సైతం 99 వికెట్లతో మెరిశాడీ పేసర్. 1975లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షటిల్వర్త్ అంపైర్‌గా అవతారమెత్తాడు. ఫస్ట్ క్రికెట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడీ వెటరన్. తమ జట్టుకు విశేష సేవలందించిన షటిల్వర్త్కు 2021లో ల్యాంక్‌షైర్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది.