Robin Smith : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ (Robin Smith) కన్నుమూశాడు. ఒకప్పుడు ఇంగ్లండ్ విజయాల్లో కీలకమైన ఈ దిగ్గజ ఆటగాడు 62 ఏళ్ల వయసులో ఆయన మరణించాడు. రాబిన్ మరణవార్తను మంగళవారం కుటుంబసభ్యులు వెల్లడించారు. సౌత్ పెర్త్‌లోని తమ ఇంట్లోనే డిసెంబర్ 1 సోమవారం రాబిన్ హఠాత్తుగా ప్రాణాలు విడిచారని వారు చెప్పారు. ప్రపంచంలోని మేటి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ లెజెండరీ ఆటగాడి మృతిపట్ల ఇంగ్లండ్ బోర్డు సంతాపం తెలిపింది.
ది జడ్జ్‌గా పేరొందిన రాబిన్ స్మిత్ మరణం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులను విషాదంలోకి నెట్టింది. ‘గుండెల నిండా బాధ, మనసు నిండా వేదనతో రాబిన్ స్మిత్ మరణించాడనే వార్తను మీతో పంచుకుంటున్నాం. డిసెంబర్ 1న మా ఇంట్లోనే అతడు హఠాత్తుగా మరణించాడు. రాబిన్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రేమించే తండ్రిగా.. సోదరభావంతో మెలిగే వ్యక్తిగా ఆయన మా హృదయాల్లో నిలిచే ఉంటాడు’ అని రాబిన్ కుటుంబం పేర్కొంది. ‘ప్రపంచంలోని అరవీర భయంకర బౌలర్లకు వెరవకుండా బ్యాటింగ్ చేసిన రాబిన్ మరణం ఇంగ్లండ్ క్రికెట్‌కు తీరని లోటు’ అని ఈసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
It is with great sadness that we announce the passing of legendary batter Robin Smith.
Known as ‘The Judge’, Smith played over 600 times for Hampshire and scored over 30,000 runs for the club in a career that spanned more than 20 years.
Our thoughts are with his family and… pic.twitter.com/eEB715R3pr
— Hampshire Cricket (@hantscricket) December 2, 2025
దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించిన రాబిన్ స్మిత్ 1983లో ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. క్రికెట్‌పై ఆసక్తితో అక్కడి హ్యాంప్‌షైర్ క్లబ్‌తో చేరిన అతడు.. దేశవాళీలో అదరగొట్టి జాతీయ జట్టుకు ఎంపియ్యాడు. దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేసిన అతడు.. అనతికాలంలోనే ఇంగ్లండ్ అత్యుత్తమ క్రికెటర్‌గా ఖ్యాతి గడించిన రాబిన్ .. 1988 నుంచి 1996 మధ్య కాలంలో 62 టెస్టులు ఆడాడు. వన్డేల్లోనూ రాణించిన రాబిన్ 1992 వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు.
Vale Robin Smith 😢😢Here he scores his first Test century, 143 against Australia during the 4th Test at Manchester 1989. That cut shot was a thing of beauty. Gone way too soon 💔💔Thoughts with his family, friends and former teammates. pic.twitter.com/BloUN89d82
— From Ashes to Archive (@ashestoarchive) December 2, 2025
దిగ్గజ క్రికెటర్‌గా 2004లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఆ తర్వాత వ్యసనభరితుడయ్యాడు. ఆల్కహాల్ అతిగా సేవించడంతో పాటు మానసిక సమస్యలతోనూ అతడు ఇబ్బంది పడిన విషయం అప్పట్లో మీడియాలో ప్రచురితమైంది. అయితే.. రెండు వారాలకు ముందు రాబిన్ ఇంగ్లండ్ లయన్స్ జట్టు స్క్వాడ్‌తో సరదాగా గడిపాడు. అంతలోనే అతడు మరణించాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.