England Board : యాషెస్ సిరీస్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వలేక ఇంగ్లండ్ (England) ఘోర పరాభవం మూటగట్టుకుంది. నాలుగు మ్యాచుల్లో ఓటమితో వరుసగా నాలుగోసారి ట్రోఫీని ఆస్ట్రేలియా(Australia)కు అప్పగించేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27)లో కీలకమైన ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన పట్ల ఆ దేశ బోర్డు అసంతృప్తిని వెళ్లగక్కింది. చెత్త ఆటకు భారీ మూల్యం చెల్లించుకుంటూ 4-1తో బెన్ స్టోక్స్(Ben Stokes) సేన ఓడడంపై తక్షణమే సమీక్షకు ఆదేశించింది ఇంగ్లండ్ బోర్డు.
ఈ పర్యటనలో మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. మా తప్పులను సరిదిద్దుకొని త్వరగా మెరుగుపడేందుకు కట్టుబడి ఉన్నాం. వచ్చే ఏడాది జరుగబోయే యాషెస్ -2027లో పుంజుకోవడంపైనే మా దృష్టంతా ఉంది. ఈసారి మా జట్టు దారుణంగా ఓడడంపై సమీక్ష నిర్వహిస్తున్నాం. పర్యటన ప్రణాళిక, ఆటగాళ్ల సన్నద్ధత, క్రికెటర్ల వ్యక్తిగత ప్రదర్శన, వారి ప్రవర్తన, పరిస్థితులకు అలవాటు పడడం.. వంటి అంశాలపై రివ్యూ ఉంటుంది అని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ రిచరల్డ్ గౌల్డ్ (Richard Gould) తెలిపాడు.
🔍 Under review
🏴 The England and Wales Cricket Board has initiated an immediate review into the #Ashes defeat, with chief executive Richard Gould promising “necessary changes over the coming months”.#Ashes2025 | #AUSvENG
🔗 https://t.co/UpjMw35XO8 pic.twitter.com/9rIAOGnucg
— The Cricket Paper (@TheCricketPaper) January 8, 2026
‘యాషెస్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నాం. ఎన్నో ఆశలతో సిరీస్‌ను ప్రారంభించాం. కానీ, మా టీమ్ చెత్తగా ఆడింది. ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ గెలుపొందాలనే మా లక్ష్యాన్ని బెన్ స్టోక్స్ బృందం చేరుకోలేకపోయింది. అయితే.. సిరీస్‌లో కొన్ని అద్భుత బ్యాటింగ్ విన్యాసాలు ఉన్నాయి. మెల్బోర్న్లో అసమాన పోరాటంతో గెలుపొందాం. కానీ, సిరీస్ ఆసాంతం నిలకడగా ఆడలేకపోయాం. మా తదుపరి సిరీస్ శ్రీలంకతో. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా లంకతో వైట్‌బాల్ సిరీస్ ఆడనుంది’ ఇంగ్లండ్ అని గౌల్డ్ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లో కోచ్ బ్రెండ్ మెక్కల్లమ్ (Brendon Mc Cullum) వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు. కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అదరగొట్టినా.. బ్యాట్‌తో తేలిపోయాడు. దాంతో.. మెక్‌కల్లమ్‌ను కోచ్‌గా తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. ఆ దేశానికి చెందిన మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ లేదా టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) రేసులో ఉన్నారని సమాచారం.
‘బజ్ బాల్’ ఆటతో టెస్టుల్లోనూ వన్డే తరహా చెలరేగే ఇంగ్లండ్ యాషెస్‌లో బొక్కబోర్లా పడింది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లో ఒక్కరోజు క్రీజులో నిలువలేక చిత్తుగా ఓడి సిరీస్ సమర్పించుకున్న బెన్ స్టోక్స్ బృందం.. మెల్బోర్న్లో విజయంతో బోణీ కొట్టింది. కానీ, చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుర్రాడు జాకబ్ బెథెల్(154) సెంచరీతో మెరిసినా.. ట్రావిస్ హెడ్(163), మిచెల్ స్టార్క్(3-72), మైఖేల్ నెసెర్ (3-64)లు పంజా విసరడంతో 5 వికెట్ల తేడాతో మళ్లీ చతికిలపడింది. ఈ దారుణ పరాజయాన్ని ఇంగ్లండ్ బోర్డు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Former England captain Michael Vaughan shared this assessment on England’s loss in the 2025–26 Ashes series 🏏#Ashes2025 #BenStokes #MichaelVaughan #CricketTwitter pic.twitter.com/4qGDl89Kkd
— CricketTimes.com (@CricketTimesHQ) January 8, 2026