NZ vs ENG : స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ (Newzealand) కోల్పోయింది. వర్షం కారణంగా మూడో మ్యాచ్ రద్దు కావడంతో రెండో టీ20 గెలుపొందిన ఇంగ్లండ్ ట్రోఫీని తన్నుకుపోయింది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. దాంతో.. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో పర్యాటక జట్టుకు చెక్ పెట్టాలని కివీస్ భావించింది. కానీ, వరుణుడు ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు చల్లుతూ మ్యాచ్ సాగనివ్వలేదు. దాంతో.. అంపైర్లు ఆటను రద్దు చేయగా.. 1-0తో హ్యారీ బ్రేక్ సారథ్యంలోని ఇంగ్లండ్ పొట్టి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది.
ఆక్లాండ్ వేదికగా ప్రారంభమైన మూడో టీ20లో న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. భారీ స్కోర్‌తో ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో పడేయాలనుకున్నారు. కానీ, 3.4 ఓవర్ సమయంలోనే వర్షం అందుకుంది. అప్పటికి కివీస్ స్కోర్.. 38-1. వర్షం తగ్గితే ధనాధన్ దంచేసి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావించింది ఆతిథ్య జట్టు.
🎙️The skipper says we are shaping up “beautifully” ahead of next year’s T20 World Cup after our series win in New Zealand pic.twitter.com/UOJHqG2pgj
— England Cricket (@englandcricket) October 23, 2025
కానీ, వాన ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో.. క్రిస్ట్‌చర్చిలో జరిగిన రెండో టీ20లో గెలుపొందిన ఇంగ్లండ్ సిరీస్ విజేత అయింది. ఆ మ్యాచ్‌లో అర్ధ శతకంతో కదం తొక్కి జట్టు విజయంలో కీలకమైన హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. పొట్టి సిరీస్ ముగియడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 26 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. బే ఓవల్‌లో మొదటి మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి.