ENG vs SA | బజ్‌బాల్ గేమ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఇంగ్లండ్ టీ20ల్లో సరికొత్త చరిత్ర లిఖించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిష్ ఆటగాళ్లు (ENG vs SA) తమ విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టు స్కోర్‌ను 300 దాటించారు. దీంతో రెండు టెస్టు జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్‌ను నమోదుచేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రఫర్డ్లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు 304 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (141 నాటౌట్, 60 బంతుల్లో 15×4, 8×6), జోస్ బట్లర్ (83; 30 బాల్స్‌లో 8×4, 7×6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ జంట తొలి వికెట్‌కు 47 బంతుల్లోనే 126 పరుగులు జోడించారు. బట్లర్ ఔటయినప్పటికీ.. బెతెల్ (26), బ్రూక్ (41)ల అండతో జట్టు స్కోరును 300 దాటించాడు. సాల్ట్ 39 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా వెంటవెటనే వికెట్లు కోల్పోయింది. తీవ్ర ఒత్తిడికి గురైన సఫారీ బ్యాట్స్‌మెన్ 17 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టులో కెప్టెన్ మార్క్రమ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో 146 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20ల్లో భారీ తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది.
కాగా, టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. అంతకు ముందు 344 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా జింబాబ్వే రికార్డు నెలకొల్పింది. గతేడాది గాంబియాపై 4 వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది. 2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 314/3 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్ కూడా ఒకసారి 300 మార్క్‌కు దగ్గరగా వచ్చింది. 2024లో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 297/6 పరుగులు చేసింది.
The moment we passed 3️⃣0️⃣0️⃣ runs!🙌
Ridiculous performance 👏 pic.twitter.com/J16JyK4ebe
— England Cricket (@englandcricket) September 12, 2025
Record-breaker! 💥
A 39-ball century! 🏏@IGCom | 🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/xSVEBcNMed— England Cricket (@englandcricket) September 12, 2025
🦁 VICTORY! 🏴
Our biggest IT20 winning margin, by 146 runs 💪
The series is level with one match to play 🏏 pic.twitter.com/8XDDdBnPPw
— England Cricket (@englandcricket) September 12, 2025