చెస్టర్ లీ స్ట్రీట్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20(ENG vs WI)లో.. 21 రన్స్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడు వన్డేల్లో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. ఫస్ట్ టీ20లోనూ ఇరగదీసింది. టీ20ల్లో టఫ్ ఫైట్ ఇస్తుందని అనుకున్నా.. విండీస్ ఆటగాళ్లు ఆశించినట్లు రాణించలేకపోయారు. టీ20 మేటి బౌలర్ అకీల్ హుస్సేన్ లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగింది. వీసా లేకపోవడంతో అతను బ్రిటన్ రాలేకపోయాడు. ఇంగ్లండ్ విక్టరీలో స్పిన్నర్ లియామ్ డాసన్ కీలక పాత్ర పోషించాడు. మూడేళ్ల తర్వాత జట్టులో చేరిన అతను ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. బ్యాటర్ జోస్ బట్లర్ 96 రన్స్ చేసి తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. 189 రన్స్ టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన విండీస్ కేవలం 167 రన్స్ మాత్రమే చేయగలిగింది. విండీస్‌లోని టాప్ ఆరుగురు బ్యాటర్లలో ఇంగ్లండ్ బౌలర్ డాసన్ నాలుగు వికెట్లు తీశాడు. అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
A confident England claim first blood in the #ENGvWI men’s T20I series 🙌
Scorecard 📱 https://t.co/cEyWFCTTxs pic.twitter.com/9Fy3JaULVf
— ICC (@ICC) June 7, 2025