Ashes Series : యాషెస్ సిరీస్ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్ (England) ఇక ఆశలు వదులుకోవాల్సిందే. రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాకు కనీసం పోటీ ఇవ్వలేకపోయిన ఇంగ్లిష్ టీమ్.. అడిలైడ్‌లోనూ అదే తడబాటుతో ఓటమి అంచున నిలిచింది. ట్రావిస్ హెడ్(170) భారీ శతకంతో పుంజుకున్న ఆసీస్ నాలుగో రోజు కమిన్స్(3-24), నాథన్ లియాన్(3-64)ల విజృంభణతో గెలుపు దిశగా సాగుతోంది. వీరిద్దరి ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలగా.. జేమీ స్మిత్(2 నాటౌట్), విల్ జాక్స్(11 నాటౌట్) పోరాడుతున్నారు. ఆఖరి సెషన్లో వీరిద్దరూ పట్టదలగా ఆడడంతో ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మరో ఓటమికి చేరువలో ఉంది. ఇప్పటికే పెర్త్, బ్రిస్బేన్‌లో కంగుతిన్న పర్యాటక జట్టు చావోరేవో పోరులోనూ ఎదురీదుతోంది. అడిలైడ్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే(85) అర్ధ శతకంతో ఆశలు రేపినా.. కమిన్స్ (3-24), నాథన్ లియాన్(3-64) వికెట్ల వేటకు టాపార్డర్ కుప్పకూలింది. కమిన్స్ ఓవర్లో జో రూట్(39), లియన్ దెబ్బకు హ్యారీ బ్రూక్(30)లు తేలిపోయారు. స్వల్ప తేడాతో బ్రూక్‌ను, బెన్‌స్టోక్స్(5)ను బౌల్డ్ చేసిన లియాన్ ఇంగ్లండ్‌ను విజయావకాశాల్ని దెబ్బతీశాడు.
Nathan Lyon 🐐 produces two near-identical beauties to dismiss Ben Duckett and Ben Stokes in the Adelaide Test
(📹 available to watch in India only)#AUSvIND #Ashes pic.twitter.com/rjXUKndd2W
— ESPNcricinfo (@ESPNcricinfo) December 20, 2025
అర్ధ శతకంతో పోరాడిన క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఓటమి అంచున నిలిపాడు లియాన్. ఆఖరి సెషన్లో జేమీ స్మిత్(2 నాటౌట్), విల్ జాక్స్(11 నాటౌట్)లు వికెట్ కాపాడుకోవడంతో ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. యాషెస్ సిరీస్ సమం చేయాలంటే ఇంగ్లండ్ విజయానికి 228 రన్స్ అవసరం. కానీ, చివరి రోజు వీరిద్దరూ సెంచరీలు సాధిస్తే తప్ప గెలుపు అసాధ్యం. ఒకవేళ తొలి సెషన్లోనే ఔటయ్యారంటే.. టెయిలెండర్లను కమిన్స్, లియాన్ చుట్టేయడం పక్కా. తొలి ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్(5-53) చెలరేగగా ఆసీస్‌ను 371కే కట్టడి చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యంతో మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయింది.
We go to a fifth day in Adelaide with Australia four wickets away from the series win, England need a miracle…
Scorecard: https://t.co/E6DrlHCvfV pic.twitter.com/zBPk4SccYY
— ESPNcricinfo (@ESPNcricinfo) December 20, 2025