Moeen Ali | లండన్: ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్కు గాను సెలక్టర్లు అలీని పక్కనబెట్టిన కొద్దిరోజులకే అతడు ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
పదేండ్ల అంతర్జాతీయ కెరీర్లో అలీ.. 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 6,678 పరుగులు సాధించిన అతడు.. 366 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ 2019లో గెలిచిన వన్డే ప్రపంచకప్, 2022 టీ20 వరల్డ్ కప్లలో అలీ సభ్యుడు.