లండన్: ఇంగ్లండ్‌కు మరో షాక్ తిగిలింది. ఇండియా సిరీస్‌తోపాటు ఐపీఎల్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్( Ben Stokes )కు తాజాగా మరో సర్జరీ జరిగింది. దీంతో అతడు కీలకమైన యాషెస్ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున ఆడిన స్టోక్స్ చేతి వేలికి గాయం కావడంతో మొదట దానికి సర్జరీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇండియా సిరీస్‌కు ముందు మానసిక సమస్యల కారణంగా నిరవధికంగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే తాజాగా అదే చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో డిసెంబర్లో యాషెస్ సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
గత ఏప్రిల్‌లో అతని విరిగిన వేలికి సర్జరీ చేసి స్క్రూలు బిగించగా.. ఇప్పుడు వాటిని తొలగించారు. స్టోక్స్ ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నా.. ఇప్పట్లో క్రికెట్‌కు తిరిగొచ్చే అవకాశం మాత్రం లేదని ఆ రిపోర్ట్ వెల్లడించింది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోక్స్ ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో తన భార్య క్లేర్ కూడా ఉంది. అతని వేలికి బ్యాండేజీ ఉండటం ఈ ఫొటోలో చూడొచ్చు.