Ashes Series : యాషెస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో, ఆస్ట్రేలియా ముందు 281 టార్గెట్ ఉంచింది. నాలుగో రోజు నాథన్ లియాన్, ప్యాట్ కమిన్స్ నాలుగేసి వికెట్లతో ఇంగ్లండ్ భరతం పట్టారు. లంచ్ బ్రేక్ సమయానికే ఐదు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. అయితే.. బెన్ స్టోక్స్(43), జానీ బెయిర్‌స్టో(20) ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. కానీ, లియాన్, కమిన్స్ వీళ్లిద్దరినీ ఔట్ చేసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చారు.
ఓవర్‌నైట్ స్కోర్ 28తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌కు కమిన్స్ షాకిచ్చాడు. తొలి సెషన్లోనే ఓలీ పోప్(14)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జోరూట్(46), హ్యారీ బ్రూక్ (46) స్కోర్‌బోర్డును ఉరికించారు. అయితే.. లియాన్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. దాంతో, ఇంగ్లండ్ స్కోర్ నెమ్మదించింది.