Jos Buttler: నాలుగు సెంచరీలు.. 863 పరుగులు.. 57 సగటు.. 149 స్ట్రైక్ రేట్.. ఇదీ 2022లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారథి జోస్ బట్లర్ ఐపీఎల్లో సాగించిన విధ్వంసం. ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగే బట్లర్.. గడిచిన మూడేండ్లుగా ఆ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2022 అంత కాకపోయినా ఈ ఏడాది మేలో ముగిసిన ఐపీఎల్ సీజన్లో కూడా బట్లర్ రాణించాడు. 14 మ్యాచ్‌లలో 392 పరుగులు చేశాడు. ఇందులో కూడా నాలుగు అర్థ సెంచరీలున్నాయి. భారత్‌లో ఏ స్టేడియంలో మ్యాచ్ జరిగినా బంతిని బాదుడే లక్ష్యంగా బరిలోకి దిగే బట్లర్.. వన్డే వరల్డ్ కప్ లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు.
భారత్‌లో టీ20లలో వీరవిహారం చేస్తున్న బట్లర్‌కు వన్డేలలో మాత్రం చెత్త రికార్డు ఉంది. తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కలుపుకుని ఇక్కడ 15 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 50 ఓవర్ల ఫార్మాట్లో ఒక్కటంటే ఒక్క అర్థ సెంచరీ (43 హయ్యస్ట్ స్కోరు) కూడా నమోదుచేయలేదంటే అతడి వైఫల్యం ఎంత దారుణంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వన్డే ప్రపంచకప్‌లో బట్లర్ స్కోర్లు.. 43, 20, 9, 15, 8, 10, 1, 5 గా నమోదయ్యాయి.
Jos Buttler has been a long way from his best 😨#ENGvNED | #CWC23 pic.twitter.com/ufkKTzW6wV
— ESPNcricinfo (@ESPNcricinfo) November 8, 2023
ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 13.87 సగటుతో 111 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా వన్డేలలో 15 ఇన్నింగ్స్ ఆడి 12.9 సగటుతో 194 పరుగులు చేయగలిగాడు. ఒకవైపు ఇంగ్లండ్ జట్టు ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి అత్యంత చెత్త ప్రదర్శనతో స్వదేశంతో పాటు క్రికెట్ విశ్లేషకుల విమర్శల దాడిని ఎదుర్కుంటుండగా అందులో సారథి స్థానంలో ఉన్న బట్లర్ పైనే అందరి టార్గెట్ కేంద్రీకృతమైంది. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినా.. కనీసం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అయినా పరువు నిలుపుకునేందుకు ఆడతాడనుకుంటే బట్లర్ నేటి మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు.
👀
Jos Buttler in India in ODIs:
Inns: 15
Runs: 194
Avg: 12.9
SR: 89.0
HS: 43#ENGvsNED #Buttler pic.twitter.com/25ZfX2GVe0— Cricbuzz (@cricbuzz) November 8, 2023
వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లీష్ జట్టులో భారీ మార్పులు ఉంటాయని ఇదివరకే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో బట్లర్‌ను సారథిగా తప్పిస్తారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ పోయినా బ్యాటర్‌గా అయినా కొనసాగుతాడనుకుంటే ఈ వైఫల్యాలు బట్లర్‌ను పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేలా ఉన్నాయి. ఇక బట్లర్ ప్రదర్శన చూశాక ఐపీఎల్లో అతడి ఆటకు ముగ్దులైన క్రికెట్ అభిమానులు.. ‘ఎసొంటెసొంటి ఇన్నింగ్సులు ఆడేటోనివి. ఏం ఆట ఆడుతున్నావ్ బట్లర్ బాయ్’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.