టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. మూడో ఓవర్లో ప్రమాదకరమైన బట్లర్ (4)ను పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన బంతిని లేట్‌గా ఆడేందుకు ప్రయత్నించిన బట్లర్ మిస్సయ్యాడు. దాన్ని అందుకున్న పంత్ ఆలస్యంగా అప్పీల్ చేశాడు.
అంపైర్ అవుటివ్వకపోవడంతో రివ్యూ తీసుకోవాలని భువీ కోరాడు. దాంతో రోహిత్ రివ్యూ తీసకున్నాడు. స్నికో మీటర్లో బంతి.. బట్లర్ బ్యాటును లైట్‌గా టచ్ చేసినట్లు తేలడంతో అతను వెనుతిరిగాడు. దీంతో లివింగ్‌స్టోన్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే రెండు బౌండరీలు బాదాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 19 పరుగులతో నిలిచింది.