ENG vs AUS: వరుస పరాజయాలతో వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినా కనీసం 2025లో పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా చోటు దక్కించుకునేందుకు తాపత్రయపడుతున్న ఇంగ్లండ్.. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నది. ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్.. స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 44), మార్నస్ లబూషేన్‌లు రాణించడంతో భారీ స్కోరు సాధించే దిశగా సాగింది. కానీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్.. రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ట్రావిస్ హెడ్.. నేటి మ్యాచ్‌లో 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆరు ఓవర్లలో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్మిత్, లబూషేన్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. అయితే స్మిత్‌ను అదిల్ రషీద్ ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.
LBW! 😍
Wood traps Labuschagne with the inswinger and the finger goes up! ☝️
🇦🇺 1️⃣7️⃣8️⃣-5️⃣#EnglandCricket | #CWC23 pic.twitter.com/8gIYNbCRjq
— England Cricket (@englandcricket) November 4, 2023
స్మిత్ స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ కూడా విఫలమయ్యాడు. మూడు పరుగులే చేసిన ఇంగ్లిస్‌ను రషీద్ పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లిస్ నిష్క్రమించాక వచ్చిన కామెరూన్ గ్రీన్ తో కలిసి ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించిన లబూషేన్ కూడా మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 34 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ ఆసీస్.. ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. స్టోయినిస్ (1 నాటౌట్), గ్రీన్ ( 28 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.