హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 5 : ప్రపంచ పారా తైక్వాండో ర్యాంకింగ్స్‌లో వరంగల్‌కు చెందిన క్రీడాకారుడు ఎల్లావుల గౌతమ్యాదవ్ సీనియర్ మెన్ పీ51 విభాగంలో 2వ స్థానం దకించుకున్నారు. ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆయన తాజా ర్యాంకింగ్స్‌తో దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చారు.
వరంగల్ నుంచి ప్రపంచస్థాయి వరకు ఎదిగిన ఆయన ప్రయాణం అనేక పారా క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని, ఈ విజయంతో రాష్ట్రంలో పారా క్రీడలపై మరింత అవగాహన పెరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సందర్భంగా క్రీడాధికారులు, అభిమానులు గౌతమ్ యాదవ్‌ని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి వరంగల్ ఖ్యాతిని చాటుతానని ఈ సందర్భంగా గౌతమ్యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.