మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సబలెంక, ఎలెనా రిబకీనా ఫైనల్‌కు దూసుకెళ్లారు. అంచనాలకు అందకుండా సాగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో గురువారం సబలెంక 7-6 (7/1), 6-2తో లినెట్టెపై విజయం సాధించగా.. మరో పోరులో 22వ సీడ్ రిబకీనా 7-6 (7/4), 6-3తో అజరెంకాను మట్టికరిపించింది. శనివారం జరుగనున్న టైటిల్ పోరులో సబలెంక, రిబకీనా అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో కచనోవ్‌తో సిట్సిపాస్, పాల్‌తో జొకోవిచ్ తలపడనున్నారు.
సానియా పోరు నేడే..
కెరీర్ చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుక్రవారం టైటిల్ పోరులో బరిలోకి దిగనుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా-రోహాన్ బోపన్న ద్వయం.. బ్రెజిల్‌కు చెందిన స్టిఫానీ-మాటోస్ జంటను ఢీ కొట్టనుంది.