ముంబై : బ్యాంకాక్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన ఎనిమిదేండ్ల ఆర్యవీర్ పిట్టి రజత పతకం సాధించాడు. ముంబైలోని అమెరికన్ పాఠశాలకు చెందిన ఆర్యవీర్ ఆరు పాయింట్లకు గాను నాలుగు పాయింట్లు సాధించి రజతం సొంతం చేసుకున్నాడు. కాగా సుతిపొన్పైశర్న్ అయిదు పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు.