ODI World Cup | రోజుకు 8 కిలోల మటన్ తిన్నట్లుంది.. పాక్ జట్టు ఫిట్‌నెస్‌పై వసీం అక్రమ్ తీవ్ర వ్యాఖ్యలు
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup ) టోర్నీలో పాకిస్థాన్ (Pakistan ) జట్టు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నైలో పసికూన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) చేతుల్లో చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకుంది. కీలక సమయంలో పరాజయం కావడంతో వారంతో ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో బాబర్ అజామ్ జట్టుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ (Wasim Akram) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup ) టోర్నీలో పాకిస్థాన్ (Pakistan ) జట్టు వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇండియాతో మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన పాక్, తాజాగా చెన్నైలో పసికూన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) చేతుల్లో చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకుంది. ఈ ఘోర పరాజయంతో సెమీస్ అవకాశాలనూ సంక్లిష్టం చేసుకుంది. ఇక పసికూన చేతిలో ఇది పాక్‌కు ఘోర పరాభవమనే చెప్పాలి. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ పాక్ ఆటగాళ్లు నిరాశపరిచారు. ఆటగాళ్లలో కనీస ఫిట్నెస్ స్థాయిలు కూడా లేకపోవడం అభిమానుల్ని, పాక్ మాజీ ఆటగాళ్లనూ తీవ్ర నిరాశపరుస్తోంది. కీలక సమయంలో పరాజయం కావడంతో వారంతో ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో బాబర్ అజామ్ జట్టుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ (Wasim Akram) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘ఇది చాలా అవమానకరం. కేవలం రెండు వికెట్లు.. 280-290 పెద్ద స్కోరేమీ కాదు. పిచ్ సంగతి పక్కన పెడితే పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూస్తేనే తెలిసిపోతుంది.. వాళ్ల ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో. గత రెండు సంవత్సరాలుగా క్రీడాకారుల్లో ఫిట్నెస్ లెవల్స్ తగ్గినట్లు మ్యాచ్ సందర్భంగా మేము చాలాసార్లు చర్చించుకున్నాము. నేను ఆటగాళ్ల పేర్లు ప్రస్తావిస్తే వ్యక్తిగతంగా వారికి నచ్చదు. వాళ్లు రోజుకు 8 కిలోల చొప్పున మటన్ తింటున్నట్టు (Eating 8 kg mutton every day) ఉంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపరంగా వాళ్లు దేశం కోసం ఆడుతున్నారని.. ఇందుకోసం పారితోషికం కూడా తీసుకుంటున్నారు అంటూ విరుచుకుపడ్డారు. వసీం వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా, సోమవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 49వ ఓవర్లో షాహిన్ షా అఫ్రిది వేసిన చివరి బంతిని హస్మతుల్లా బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి పంపి విన్నింగ్ షాట్ కొట్టారు. తొలుత పాకిస్థాన్ భారీగానే పరుగులు చేసినా.. తదుపరి బ్యాటింగ్ కు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ ను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలం అయ్యారు.
Also Read..
ODI World Cup | పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ విజయం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

