Israel-Hamas War | యుద్ధం విషయంలో వైఖరి మార్చిన చైనా.. ఇజ్రాయెల్‌కు ఆ హక్కు ఉందంటూ అంగీకరించిన డ్రాగన్
Israel-Hamas War | ఇజ్రాయెల్‌పై హమాస్ నరమేధాన్ని (Israel-Hamas War) ఖండించకపోవడంతో విమర్శలను ఎదుర్కొన్న డ్రాగన్ (China).. ఈ యుద్ధం విషయంలో తాజాగా తన వైఖరిని మార్చింది. తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అంగీకరించింది ( Israel Has Right To Self Defence).
Israel-Hamas War | ఇజ్రాయెల్‌పై హమాస్ నరమేధాన్ని (Israel-Hamas War) ఖండించకపోవడంతో విమర్శలను ఎదుర్కొన్న డ్రాగన్ (China).. ఈ యుద్ధం విషయంలో తాజాగా తన వైఖరిని మార్చింది. తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అంగీకరించింది ( Israel Has Right To Self Defence). ‘ప్రతి దేశానికీ ఆత్మరక్షణ హక్కు ఉంటుంది. కానీ, అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి పౌరులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు ఉండాలి’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) వ్యాఖ్యానించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా చైనా మాట్లాడటం ఇదే తొలిసారి. అయితే, అమెరికా ఉన్నత స్థాయి పర్యటనకు సిద్ధమవుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.
యుద్ధం విషయంలో గత వారం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping) స్పందించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఈజిస్ట్ సహా ఇతర అరబ్ దేశాలతో కలిసి వీలైనంత త్వరగా పాలస్తీనా సమస్యకు సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత పరిష్కారం కోసం సమన్వయం చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే, హమాస్ దాడిని ఖండించడం, ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడం వంటి ప్రకటన ఎక్కడా చేయలేదు. ఈ విషయంలో మొదటి నుంచి అస్పష్ట వైఖరిని అవలంభించిన చైనా.. ఇప్పుడు మాత్రం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం.
Also Read..
Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి
Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

