ODI World Cup | పాక్‌ను చిత్తు చేసిన ఆఫ్ఘన్.. మైదానంలో చిందులేసిన భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. VIDEO
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan).. తాజాగా పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను చిత్తు చేసింది.
ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)లో మరో సంచలనం నమోదైంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan).. తాజాగా పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)ను చిత్తు చేసింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఓడీఐస్లో తొలిసారి పాక్ జట్టును ఓడించి ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది. దీంతో మ్యాచ్ అనంతరం ఆఫ్ఘన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. మైదనంలో ఆటగాళ్లంతా ఆనందంతో చిందులేశారు.
ఈ సందర్భంగా గ్రౌండ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ జట్టు విజయంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కూడా పాలు పంచుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా అదే గ్రౌండ్లో ఉన్న ఇర్ఫాన్ పఠాన్.. మైదానంలో చిందులేశారు. ఆఫ్ఘన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan)తో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 49వ ఓవర్లో షాహిన్ షా అఫ్రిది వేసిన చివరి బంతిని హస్మతుల్లా బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి పంపి విన్నింగ్ షాట్ కొట్టారు. తొలుత పాకిస్థాన్ భారీగానే పరుగులు చేసినా.. తదుపరి బ్యాటింగ్ కు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ ను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలం అయ్యారు. స్పిన్ బౌలర్లు ధారాళంగా విరాళాలు ఇచ్చారు. హస్మతుల్లా షాహిదీ 48 పరుగులు, రహ్మత్‌షా 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
Irfan Pathan dancing with Rashid Khan.
– Video of the day from Chepauk…!!!pic.twitter.com/ijoMGqKht1
— Johns. (@CricCrazyJohns) October 23, 2023
Also Read..
Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి
Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

