BAN vs PAK : ఆసియా కప్ ఫైనల్ బెర్తును నిర్ణయించే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు విఫలమయ్యారు. పాక్ బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. షాహిన్ అఫ్రిది(2-18), సయీం ఆయూబ్(2-16)లు చెలరేగడంతో టాపార్డర్ కుప్పకూలగా.. షమీమ్ హొసేన్(30) జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం తంజిమ్ హసన్(4)తో భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు. 16 ఓవర్లకు స్కోర్. 90-6. ఇంకా విజయానికి 24 బంతుల్లో 46 పరుగులు కావాలి.
ఆసియ కప్‌లో శ్రీలంకకు చెక్ పెట్టిన బంగ్లాదేశ్.. సూపర్ 4 రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను తక్కువకే కట్టడి చేసింది. స్పిన్నర్ రిషద్ హొసేన్(2-18), పేసర్ తస్కిన్ అహ్మద్(3-28)ల విజృంభణతో పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు కట్టడి చేయడంతో పవర్ ప్లేలో 27 రన్స్ మాత్రమే చేసింది. 49 పరుగులకే సంగం వికెట్లు కోల్పోయిన జట్టును మొహమ్మద్ హ్యారిస్ (31), నవాజ్ (25) ఆదుకున్నారు. ఈ ఇద్దరి కీలక ఇన్నింగ్స్‌తో కోలుకున్న పాక్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది.
ANOTHER WICKET – Bangladesh are 29 for 3 in a 135-run chase 👀 #PAKvBAN live ▶️ https://t.co/sBfTGWerP0 pic.twitter.com/MlgNDTUam7
— ESPNcricinfo (@ESPNcricinfo) September 25, 2025