హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(టీపీజీఎల్)లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. లీగ్‌లో గోల్డెన్ ఈగల్స్, వ్యాలీ వారియర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన వేర్వేరు సెమీస్‌లో గోల్డెన్ ఈగల్స్ 3.5-2.5తో టీమ్ టీఆఫ్ ఫెయిర్మౌంట్పై విజయం సాధించింది. మరో సెమీస్‌లో వ్యాలీ వారియర్స్ 4-2తో రిట్జ్ మాస్టర్స్‌పై గెలిచింది.