Dwayne Bravo | కోల్‌కతా: వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావో త్వరలో కొత్త బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఐపీఎల్ గత సీజన్ విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు అతడు వచ్చే ఎడిషన్ నుంచి మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ మేరకు కేకేఆర్ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 2024 సీజన్లో కేకేఆర్‌కు గౌతం గంభీర్ మెంటార్‌గా వ్యవహరించగా బ్రావో.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.