RCB vs SRH : ఐపీఎల్ 17వ సీజన్లో 30వ మ్యాచ్ మరికాసేపట్లో జరుగనుంది. చిన్నస్వామి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు.
వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన బెంగళూరు జట్టులో రెండు మార్పులు చేసింది. గాయపడిన మ్యాక్స్‌వెల్, వరుసగా విఫలమవుతున్న సిరాజ్‌కు బెంగళూరు విశ్రాంతినిచ్చింది. మరోవైపు పంజాబ్‌పై విజయంతో జోరుమీదున్న కమిన్స్ సేన ఏ మార్పులు లేకుండా ఆడనుంది.
హైదరాబాద్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మర్క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాహ్బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్, జయదేవ్ ఉనాద్కాట్, నటరాజన్.
బెంగళూరు తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహన్, దినేశ్ కార్తిక్, మహిపాల్ లొమ్రోర్, విజయ్‌కుమార్, రీసే టాప్లే, ల్యూకీ ఫెర్గూసన్, యశ్ దయాల్.