సేలం: టీమ్ఇండియా ఆటగాడు హనుమ విహారి (107 బ్యాటింగ్) అజేయ శతకంతో కదం తొక్కడంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. నార్త్‌జోన్‌తో జరుగుతున్న పోరులో గురువారం ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. కెప్టెన్ విహారితో పాటు.. అరంగేట్ర ఓపెనర్ రోహన్ (143) సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (49) పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం విహారితో పాటు బాబా ఇంద్రజిత్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సెంట్రల్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి వెస్ట్‌జోన్ 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వెస్ట్‌జోన్ తరఫున పృథ్వీ షా (60), రాహుల్ త్రిపాఠి (64 బ్యాటింగ్) అర్ధశతకాలతో రాణించగా.. సెంట్రల్‌జోన్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ 5 వికెట్లు పడగొట్టాడు.