బెంగళూరు: దేశవాళీ ఆరంభ సీజన్ దులీప్ ట్రోఫీ తుది అంకానికి చేరింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం నుంచి సౌత్ జోన్, సెంట్రల్ జోన్ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
త్వరలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు గాను సెలక్టర్ల దృష్టిలో పడేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫైనల్ కీలకం కానుంది. ఇప్పటికే క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లలో సెంట్రల్ జోన్ బ్యాటర్లు డానిష్ మాలేవర్, కెప్టెన్ రజత్ పాటిదార్, శుభమ్ శర్మ అంచనాలకు మించి రాణించారు. సౌత్‌జోన్ నుంచి కర్ణాటక బ్యాటర్ రవిచంద్రన్ సమ్రన్, కెప్టెన్ అజారుద్దీన్, తన్మయ్ కీలకం కానున్నారు.