బెంగళూరు : జమ్మూకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ (5/28) హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో నార్త్.. ఈస్ట్ జోన్‌ను 230 పరుగులకే నిలువరించి 175 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. నార్త్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులకు ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్ తరఫున విరాట్ సింగ్ (69) టాప్ స్కోరర్.
53వ ఓవర్లో అతడు.. విరాట్, మనీషి, ముఖ్తార్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదుచేశాడు. ఇక నార్త్ ఈస్ట్‌తో జరుగుతున్న మరో పోరులో సెంట్రల్ జోన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. సెంట్రల్ జోన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 532/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దానిష్ (203 రిటైర్డ్ ఔట్) ద్విశతకం సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నార్త్ఈస్ట్.. 65 ఓవర్లలో 168/7 రన్స్ చేసింది.